మేలుకోవయ్యా, ఓ బొజ్జ గణపయ్య

ప: మేలుకోవయ్యా, ఓ బొజ్జ గణపయ్య

మమ్మేలుకోవయ్యా, ఇంటింటి రాజువయ్యా ||

చ: కుహు కుహు గానాలతొ కోయిలలు

తకధిమి తకతై నాట్యాలతో నెమళులు

కిలకిలా రావాలతొ పికములూ

ప్రకృతే పరవశించిపోవగా

మేలుకొలుపుచున్నాయి మెల్లగా, మెలమెల్లగా ||

చ: ముగ్గులతో మురిసిపోవు ముంగిళ్ళు

పసుపు కుంకుమలతొ అలరారు లోగిళ్ళు

ప్రతి గడపకు శోభనిచ్చు తోరణాలు, మామిడి తోరణాలు

వేచివున్నామని నీ రాకకై

వేగిరపడుతున్నవి నీ పాదధూళికై ||