ఎంత చక్కని వాడమ్మా సాయినాధుడు

ప: ఎంత చక్కని వాడమ్మా సాయినాధుడు

ఎంత చల్లని వాడమ్మా సాయిదేవుడు ||

చ: విద్యను ఒసగే గణపతివాడే

సంతతినొసగే సుబ్రహ్మన్యుడే

మహిషుని జంపిన దుర్గ వాడే

కరుణ జూపగ మనకై అవతరించాడే

సాయి సద్గురుడే వాడే ||

చ: దశగ్రీవుని దునిమిన రాముడు వాడే

గీతను తెలిపిన మురలీధరుడే

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడే

కలిదోషము బాపగ అవతరించాడే

సాయి సద్గురుడైనాడే ||

సాయిరాం సాయిరాం సాయిరాం

ప: సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

సాయిరాం సాయిరాం మధురమే సాయినామం ||

చ: తల్లి తండ్రి గురు దైవం

నీవేలే సాయిరాం

ఏ పేర పిలిచినా పలికే పరమాత్మవు

మా వెతలు బాప భువిపై అవతరించినావు ||

చ: కన్న తండ్రి నీవని, పుట్టిల్లు షిరిడి అని

పదసన్నిధి చేరాను నేను

పసిపాపననుకుని, ఒడిలోకి చేకొని

దీవించ రావయ్యా నన్ను (ఈ బేలను) ||