విఠలా విఠలా, పాండురంగ విఠలా

ప: విఠలా విఠలా, పాండురంగ విఠలా

మా సాయి మనసే కరిగేటి మంచుకొండ ||

చ: నింబవృక్షపు నీడలో తపమాచరంచినవాడట

కల్పతరువై భక్తులకు తానే నీడైనాడత

చ: నీటితో దివ్వెలు వెలిగించి, హృదిజ్యోతిని గాంచమన్నాడట

బాటను నడచిన అందరూ దేవతలయ్యేరంటా ||

చ: చరణములంటిన త్రివేణి సంగమ దర్శన భాగ్యమేనంట

నామధ్యానము నిరతము చేసిన తానే అండగ ఉండునట ||

ఏల ఈ శోధన శ్రీ సాయినాధా

ప: ఏల ఈ శోధన శ్రీ సాయినాధా

కరుణించి మమ్ము కావగ జాగేలా ||

చ: నీ అభయం కల్పవృక్షము కన్న అధికమని

తెలిసి నిన్ను కొలిచి మదిని నిలిపె నేనుండగా ||

చ: నీ చరణం పావన గంగాయమునల సంగమమని

తలచి దరిని నిలిచి మేను మరిచి నేనుండగా ||

చ: నీ హృదయం నవనీతముకన్న మృదువని

నమ్మి తన్మయమ్ముగమ్మి కనులనీరుజిమ్మి నేనుండగా ||