ఆర్తినే ఆరతిగా చేసాను సాయి

ప: ఆర్తినే ఆరతిగా చేసాను సాయి

ఆర్తి బాపి ఆనందాల తేలించ రావొయి

సాయీ ద్వారకామాయీ, ఓ సాయి ||

చ: కన్నులారగాంచగా నీ చల్లని నగుమోము

ఏనాడు నోచినానో ఏ నోము

మనసారగ తలచగ నీ నామము

ఏనాడు చేసినానొ ఏ పుణ్యము ||

చ: నీ రాకతొ మారెనుగా ఇల్లే కోవెలగా

ఈ లోగిలి ఏనాడో చేసుకున్న భాగ్యముగా

బ్రతుకే సాగెనుగా ప్రతిరోజూ పండుగగా

ఇది కరుణతో నీవే మాకిచ్చిన వరముగా ||

తీరని ఋనమే కావాలి, మళ్ళీ జన్మకే రావాలి

ప: తీరని ఋనమే కావాలి

మళ్ళీ జన్మకే రావాలి

సాయిసేవే ఊపిరికావాలి

సాయి ఒడీలో ఊయలలూగాలి ||

చ: ఏవో చేయాలని ఎంతో అనుకుని

మమతల ఒడిలో తగులుకుని

మరపుల నీడలో చిక్కుకుని

ఏమిచేయలేని నా గతినే నీవుగని

కరుణించిన నీ క్షమనుగని

నిన్నే వరమును అడిగితిని ||

చ: కోరె ధనము శ్రధ్ధా సహనమని

ఇచ్చె వరము నీ అభయమని

తెలిసినా మది మాటవిని

వ్యామోహపు వలలో చిక్కుకుని

నిన్నే నిందించినా

వలదని వదలి వెళ్ళినా

నీడై మము గాచినా

తోడై మాతో నడచినా

నీ చరణములే వేడితిని

నీ శరణమునే కోరితిని ||

చ: నీ పదములకంటిన ధూళిని నేనై

దేహాన దాల్చిన వస్త్రము నేనై

హృదిపై నిలిచే పుష్పమునై

నీడను ఒసగే చత్రమునై

ఎంతో మురిసిపోవాలని

తపము జపమే జేసినా

అంతటి భాగ్యము కలిగేనా

మరుజన్మకైనా తీరేనా

వినపడలేదా నా వేదన ||