ప: సాయి సాయను దివ్యనామము
చేర్చు మనలను వైకుంఠధామము
సాయినామము మోక్షప్రదము
చింతనజేయుము అనుక్షణము ||
చ: ప్రయాగయాత్ర చేయగ తలచెను
దాసగణు సాయిని అనుమతి వేడెను
పదముల గంగాయమునలజూపెను
విష్ణువు తానెయని ఋజువుచేసెను ||
చ: పండరినాధుని దర్శనమేగోరె
దాసగణు సాయిసన్నిధిజేరె
నామసప్తాహము చేయ సంకల్పించె
పుండరీకవరదుడై సాయి అగుపించె ||
చ: కన్నులార గాంచెనతడు సాయిలీలలనే
మదిలోన నిలిపె నిరతము సాయి పదములనే
కీర్తించెననుక్షనమూ సాయి మహిమలనే
ఆతని తలచినా చాలు కైవల్యమే ||