ప: నీలాకాశంలో నీవు
ఈ నేల మీద నేను
ఆ నింగినుండి నువ్వేనాకై దిగివస్తానంటావా
ఈ నేల నుండి నన్నే నీ దరికే రమ్మంటావా
సాయీ సాయీ సాయీ సాయీ ||
చ: అమ్మ నాన్న అక్క చెల్లని బంధాలెన్నో ఇచ్చావు
ఆ బంధమెంత తీయనో నీవే తెలియజెప్పావు
అభిమానాలే వదలలేని ఆశలు మాలోపెంచావు
ఆ ఆశలే వదిలి నీదరి చెరగలేనిమనసిచ్చావు
ఓ సాయీ !
అందుకే నీవే నాకై నింగిని విడిచి రావాలి
నేనే రావాలంటే నా ఆశలన్నీ తీరాలి||
సాయీ ! సాయీ !
చ: మగువుకు మగడే దైవం అంటూ అనురాగాన్ని ఇచ్చావు
అనురాగానికి అలంకారమని సహనం మాకు నేర్పావు
తల్లికి పిల్లలె ప్రాణం అంటూ ప్రేమ పాశం వేశావు
ఆ మమకారం నీకూ మాపై ఉందని తెలియజేశావు
ఓ సాయీ !
అందుకే నీవేమాకై నింగిని విడిచిరావాలి
నీ పిల్లలం మేము కనుక మాతో ఆడిపాడాలి
సాయీ ! సాయీ !
చ: ఆటల పాటల అల్లరి బాబును చల్లని దయతో ఇచ్చావు
బాబు ఆటకు బొమ్మగమారిన అమ్మను నన్ను చెశావు
బంగరు పాపను కానుకనొసగి బ్రతుకే పండుగ చెశావు
స్వర్గంలాంటి సంసారంలో మాధుర్యాన్ని చూపావు
ఓ సాయీ!
అందుకే నీవెనాకై నింగిని విదిచి రావాలి
నేనే రావాలంటే నీవే కొంచమాగాలి ||