ఎప్పుడొస్తుందీ సోమవారం!

ఇల్లంతా చెదలు,
ఉతుక్కోవడానికి బోలెడన్ని బట్టలు,
లేటైన పనిమనిషి,
పనే చెయ్యని ఫానులు,
కనిపించని కళ్ళజోడు,
ఎటుచూసినా బూజు బాబొయ్ బూజు,
తలంతా చుండ్రు,
తలకెక్కిచ్చుకోవలసిన పుస్తకాలు,
నా అర్ధభాగానికి ఇంటి పరీక్షలైతే,
నా అర్ధాంగికి వంటింటి పరీక్షలు, రేపేమో ఎం.టెక్కు పరీక్షలు,

ఆహా ఏమి భాగ్యం మాకీ ఆదివారం.
ఎప్పుడొస్తుందిరా భగవంతుడా సోమవారం!