నేనే చెప్పాను, నేనప్పుడే చెప్పాను

పనిలో ఉన్న సరదాకన్నా, మనతో పనిచేసేవారితో ఉన్న సరదా ఎక్కువ.

నా మొదటి ఉద్యోగం లో, అంటే నేను సత్యం కంప్యూటర్స్ లో పనిచేసెటప్పుడు, ఉచిత సలహాలు ఎన్నో విన్నాను. వాటిలో ఎన్ని నేను తీసుకున్నాను, ఎన్ని నాకు మంచి చేసాయి అనేవి పక్కన పెట్టండి. విషయమేంటంటే, నేను సలహాలు విననప్పుడు మాత్రం “నేనప్పుడే చెప్పాను” అనే దెప్పుడు మాత్రం నాకు తప్పేదికాదు. మొదట్లో సీనియర్ల సలహాలు వినటం మంచిదేమో అనే అనిపించింది. కానీ, వారు ప్రతి సలహాకి “నేను చెప్పాను కానీ, నువ్వే నిర్ణయం తీసుకో” అని కలిపి చెప్పటం వల్ల, నేను ఎప్పుడూ అదోరకమైన సంధిగ్ధావస్థలో ఉండిపొయాను. Continue reading “నేనే చెప్పాను, నేనప్పుడే చెప్పాను”

బచ్చన్లతో బంధుత్వం

సోమవారం: తనకి బాబు పుట్టిన ఆనందంలో మిఠాయి పంచాడు, ప్రసాద్.

మంగళవారం: ఐష్వర్యా రాయ్ కి పాప పుట్టిన వార్త.
ఆ రోజు మధ్యాహ్నం: “ప్రసాదూ, ఐష్వర్యా రాయ్ కి పాప పుట్టిందట. మీ అబ్బాయికి అడగొచ్చుగా”, అన్నాడు నిన్న మిఠాయి తిన్న శివ.