నేనే చెప్పాను, నేనప్పుడే చెప్పాను

పనిలో ఉన్న సరదాకన్నా, మనతో పనిచేసేవారితో ఉన్న సరదా ఎక్కువ.

నా మొదటి ఉద్యోగం లో, అంటే నేను సత్యం కంప్యూటర్స్ లో పనిచేసెటప్పుడు, ఉచిత సలహాలు ఎన్నో విన్నాను. వాటిలో ఎన్ని నేను తీసుకున్నాను, ఎన్ని నాకు మంచి చేసాయి అనేవి పక్కన పెట్టండి. విషయమేంటంటే, నేను సలహాలు విననప్పుడు మాత్రం “నేనప్పుడే చెప్పాను” అనే దెప్పుడు మాత్రం నాకు తప్పేదికాదు. మొదట్లో సీనియర్ల సలహాలు వినటం మంచిదేమో అనే అనిపించింది. కానీ, వారు ప్రతి సలహాకి “నేను చెప్పాను కానీ, నువ్వే నిర్ణయం తీసుకో” అని కలిపి చెప్పటం వల్ల, నేను ఎప్పుడూ అదోరకమైన సంధిగ్ధావస్థలో ఉండిపొయాను.

తరువాత కొంతకాలానికి సీనియర్లన్న తర్వాత సలహాలు సహజం అని సరిపెట్టుకున్నాను. మరికొంతకాలానికి ఉద్యోగం మారాను. ఎ.టి.జి కన్సల్టింగ్ వారితో కలిసి పనిచేసాను. ఇక్కడ ఎవరూ సలహాలు ఇవ్వరు, కానీ తీసుకోకపోతే మాత్రం తప్పుచేసామని గుర్తుచేస్తారు. ఉదాహరణకి, నేను ఇక్కడ ఉద్యోగం మానేసే సమయం లో ఒక మేనేజరు అన్న మాటేంటంటే, “సీనియర్ డైరెక్టర్ గారి సలహా తీసుకోకపోయారా!?“. చెప్పే వాడెదో వాడికి తోచింది చెప్పక ఇలా పక్క వాళ్ళ మాట వినండి అనడం, ఇదో రకమైన హింసగా అనిపించేది నాకు. ఇలాంటి మాటలు సరిగ్గా చేసే పనేంటంటే, సమయం వ్రుధా చెయ్యటం.

తర్వాత నేను పనిచేసిన కాలేజీ ఎప్పుదూ సలహాలు ఇచ్చిన పాపాన పోలేదు. బాధేమిటంటే, వీళ్ళు సలహాలు తీసుకున్న పాపాన కూడా పోలేదు. నవ్వుకుంటున్నారా? అంతేలెండి, ఏది ఏవైనా, ఎవరేమనుకున్నా, నేనుకుడా ఒక ఉద్యోగినే కదా!

ఇప్పుడు మరో రకం పరిచయమైంది నాకు. వీరు సలహాలు సూటిగా ఇవ్వరు, కానీ మరేవరో ఐతే “అలా” చేసేవారు అని చెప్తారు. ఆ “అలా” అనేది మనకి “అలా” చెయ్యమని చెప్పారని మనకి అర్ధం అయితే బాగానే ఉంటుంది. కానీ, నేను నాకు తెలిసిన పని తెలిసినట్టుగా చేసి, “అలా” చెయ్యటం అనవసరం అని సరిపెట్టుకున్నాను. నేను మర్చిపొయిన విషయం (అర్ధం చేసుకోని విషయం కూడా), నాకు “మరేవరో ఐతే” అని చెప్పిన వారే, ఆ “మరెవరో” అయ్యి ఉంటారని తెలుసుకోలేకపోవడం. తర్వాత మన సీనియర్ వచ్చి, “” సలహా ఇచ్చినప్పుడు తెలుస్తుంది, అది వారివల్ల వచ్చిన పర్యావసానమే అని. సీనియర్ చెప్పిన మాట కాదనలేక మనం “” సలహా పాఠించామే అనుకోండి, ఆ తర్వాత మనం వినే మొదటి మాట, “నేనప్పుడే చెప్పాను“. ఆ మాట ఎ”వారి“నించి వస్తుందో తెలిసిందా?

2 thoughts on “నేనే చెప్పాను, నేనప్పుడే చెప్పాను

  1. Pingback: Secretary or Satan? | Life is fascinating

Leave a reply to movieconRakesh Cancel reply