ప: భోగిపళ్ళు పోయరారె బాబాకు
భోగభాగ్యములతో అలరారు మన బ్రతుకు ||
చ: ప్రేమతో దరిచేరిన పాదములకు భోగిపళ్ళు
జగతినెల్ల పాలించే జంఘములకు భోగిపళ్ళు
జీవకోటిని నడిపించే జానువులకు భోగిపళ్ళు ||
చ: ఓడినిచేర్చి లాలించే ఉరువులకు భోగిపళ్ళు
భువనములను దాచిన ఆ ఉదరమునకు భోగిపళ్ళు
నవనీతమువలె కరిగే హృదయమునకు భోగిపళ్ళు ||
చ: పిలుపువిని బదులుపలుకు కంఠమునకు భోగిపళ్ళు
బాధలందు ఆదరించు బాహువులకు భోగిపళ్ళు
అభయమొసగి అక్కునజెర్చు కరమునకు భోగిపళ్ళు ||
చ: అమ్రుత వాక్కులే పలుకు అధరమునకు భోగిపళ్ళు
ఊయలకే ఊపిరొసగు నాసికకు భోగిపళ్ళు
కరుణా కాంతి కురిపించే సాయి కన్నులకు భోగిపళ్ళు ||
చ: విన్నపాలు ఆలించే కర్ణములకు భోగిపళ్ళు
విధివ్రాతను మార్చగల ఆ నుదురుకు భోగిపళ్ళు
సౌభాగ్యమొసగే సాయి శిరమునకు భోగిపళ్ళు ||
జీవకోటి క్షేమమరయు సాయి శిరమునకు భోగిపళ్ళు ||